Akhanda 2: బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఐతే, ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఇంట్రో సీన్ అదిరిపోతుందట. ఇందులో అఘోర పాత్ర పోషిస్తున్న బాలయ్య, హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా ఆయన పాత్ర రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఆ సమయంలో విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయట.కాగా ఈ సినిమా మొత్తంలోనే ఈ ఇంట్రో సీన్ మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్ర పై ఈ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.