Shubham: చాలా కాలం తర్వాత సమంత తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల రూపొందించిన ‘శుభం’ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల ముందు జరిగిన ప్రీమియర్ షోలు హౌస్‌ఫుల్‌తో దుమ్మురేపాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన రివ్యూలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. మే 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సమంత మార్క్ సందడి చేయనుందని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read: Maharaja 2 : విజయ్ సేతుపతి: మహారాజా 2తో మరో సంచలనం.. ఫ్యాన్స్‌లో హైప్ పీక్స్!
Shubham: ‘శుభం’లో సమంతతో పాటు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, ‘కీడా కోలా’ ఫేమ్ రాగ్ మయూర్ నటించారు. మేకర్స్‌లో ఉన్న ధీమాతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమంత అభిమానులకు ‘శుభం’ ఓ విజయోత్సవంలా మారనుందని, ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయనుందని అందరూ ఆశిస్తున్నారు.
శుభం అధికారిక ట్రైలర్ :