Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత దీపావళి పండుగను రాజస్థాన్ లో జరుపుకున్న విషయం తెలిసిందే. రణతంబోర్ జాతీయ పార్కులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలలో సమంత చాలా బలహీనంగా కనిపిస్తున్నారని, కాస్త బరువు పెరగాలని ఓ అభిమాని కోరారు. ఈమేరకు సోమవారం సమంత ఇన్ స్టాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ లో సదరు అభిమాని ఈ కామెంట్ చేశారు. ‘ప్లీజ్ మేడం, కాస్త బరువు పెరగండి’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీతో కామెంట్ పెట్టారు. దీనిపై సమంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘మళ్ళీ బరువు గురించే ప్రశ్న. మయోసైటిస్ కారణంగా వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నాను. అందువల్లే నా బరువు ఇలా ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలానే ఉండాలి. ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి. మనం 2024లో ఉన్నాం. దయచేసిన అవతలి వాళ్లను కూడా బతకనివ్వండి’ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఈ సిరీస్‌లో కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.