Samantha: గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా చీకటి కోణాన్ని ఎదుర్కొని, ఇప్పుడు ఇప్పుడే పూర్తిగా కోలుకుంటున్న అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు వృత్తిపరంగా సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. సినిమాలు, నిర్మాత బాధ్యతలతో పాటు, వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్న సామ్.. తాజాగా తన కొత్త ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రకటించింది.
ఫ్యాషన్ ప్రపంచంలో మరో అడుగు: ‘ట్రూలీ స్మా’
సమంత ఇప్పటికే పలు స్టార్టప్‌లు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, తన పాత క్లాతింగ్ బ్రాండ్ ‘సాకీ’తో పాటు.. తాజాగా ‘ట్రూలీ. స్మా (Truly. Sma)’ అనే పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్‌ను ప్రారంభించింది.
ఈ కొత్త వెంచర్‌ను ప్రకటిస్తూ, “ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ట్రూలీ స్మా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉంది. శరీరానికి రెండో చర్మంలా దుస్తులు ఉంటాయి. ఎంతో సౌకర్యంగా ఉండే దుస్తులను ఆన్లైన్లో పొందండి” అంటూ సమంత వీడియోను పోస్టు చేసింది. సమంత ఈ కొత్త ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రాతో (Myntra) కలిసి ప్రారంభించడం ఫ్యాషన్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ బ్రాండ్‌లో మహిళలకు సంబంధించిన కలెక్షన్లు ఎక్కువగా అందుబాటులో ఉండనున్నాయి.
బిజీగా సమంత – నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా
అనారోగ్యం కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bihar Exit Poll Results 2025: బిహార్‌లో మళ్లీ ఎన్డీయేదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..?
సినిమాలు & నిర్మాణ రంగం:
తన సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్’లోనూ సామ్ నటిస్తోంది. సమంతకు సినిమాలతో పాటు వివిధ రంగాల్లో వ్యాపారాలు, పెట్టుబడులు ఉన్నాయి. మహిళల రుతుక్రమ ఆరోగ్య సంరక్షణ బ్రాండ్ జోయ్‌ని ప్రారంభించింది.
అర్బన్ కిసాన్ (హైడ్రోపోనిక్ ఫార్మింగ్), నూరిష్ యు (సూపర్‌ఫుడ్స్) వంటి అనేక స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు.చెన్నై సూపర్ చాంప్స్ పికిల్‌బాల్ బృందానికి సహ-యజమానిగా వ్యవహరిస్తున్నారు.సీక్రెట్ ఆల్కెమిస్ట్ (అరోమాథెరపీ), గటాకా (పెర్ఫార్మెన్స్ సప్లిమెంట్స్) వంటి వెంచర్లలో భాగస్వామ్యం ఉంది.అభ్యాస పాఠశాల ఏకమ్ను సమంత స్థాపించింది.
ఒకవైపు ఆరోగ్యం మెరుగుపర్చుకుంటూనే, మరోవైపు కొత్త సినిమాలకు సైన్ చేస్తూ, వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని సమంత తీసుకున్న ఈ నిర్ణయానికి సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
