Samantha - Raj

Samantha – Raj: మళ్ళీ దొరికిపోయిన సమంత! ఈసారి సీరియస్?

Samantha – Raj: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, అగ్ర దర్శకుడు రాజ్ నిడిమోరు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ముంబైలోని ఒక రెస్టారెంట్ నుండి ఇద్దరూ కలిసి బయటకు వచ్చి, ఒకే కారులో బయలుదేరడం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో వీరి మధ్య బంధంపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

జూలై 30వ తేదీ రాత్రి ముంబైలోని ఒక రెస్టారెంట్ వద్ద సమంత, రాజ్ నిడిమోరు కలిసి కనిపించారు. వీరిద్దరూ రాత్రి భోజనం చేసి బయటకు వస్తున్న సమయంలో కెమెరాల కంటికి చిక్కారు. మొదట సమంత కారులో కూర్చుంది, ఆ తర్వాత రాజ్ నిడిమోరు వచ్చారు. ఈ సమయంలో ఫోటోగ్రాఫర్లు వారిని చుట్టుముట్టగా, రాజ్ నిడిమోరు కొంత అసహనంగా, కోపంగా కనిపించారు. ఈ దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, అనేక మంది దీనిపై చర్చించుకుంటున్నారు.

Also Read: Thank You Dear: ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

సమంత, రాజ్ నిడిమోరు గతంలో కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. వీరిద్దరూ ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌లో కలిసి పనిచేశారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు ఒక క్రీడా కార్యక్రమంలోనూ, అలాగే ఒక ఆలయంలోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు. ఈ సంఘటనలన్నీ అప్పట్లో వీరి బంధంపై అనేక ఊహాగానాలకు దారితీశాయి.

అయితే, సమంత గానీ, రాజ్ నిడిమోరు గానీ తమ బంధం గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోతో మరోసారి వీరి రిలేషన్‌షిప్‌పై చర్చ మొదలైంది. వీరి మధ్య కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉందా, లేక అంతకు మించి ఏదైనా ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *