samantha : షూటింగ్ లో ఉన్నప్పుడు అంతా మర్చిపోయా : సమంత

స్టార్ హీరోయిన్ సమంత ‘మయోసైటిస్’ వ్యాధి కారణంగా ఏడాదికి పైగా షూటింగ్స్ కు దూరంగా ఉన్నసంగతి తెలిసిందే. ఈ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల ను గుర్తుకు తెచ్చుకుంది సామ్. ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ప్రమోషన్ టైంలో.. వయోసైటిస్ కారనంగా తాను ఎదుర్కొన్న సమస్యను గుర్తు చేసుకుంది. తాను ఒకరోజు జ్ఞాపక శక్తి కోల్పోయానని చెప్పింది. ‘సిటాడెల్ : హనీ బన్నీ’ షూటింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా అంతా మర్చిపోయానని తెలిపింది. చాలామంది పేర్లు మర్చిపో యాను. ఆ షూటింగ్ కోసం ఉపయోగించిన సెట్ టైమ్ ఇంకా ఒకే ఒక్క రోజు మాత్రమే ఉందన్నారు. ఆ పరిస్థితిలో నేను అన్నీ మర్చిపోయాను. ఎవరో మనుషులు వస్తున్నారు… వెళుతున్నారు.. ఓ స్టంట్ మాస్టర్ నా ముందు ఉన్నాడు. నేనేం చే స్తున్నానో తెలియలేదు. అంతా అయో మయంగా ఉంది . ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నా… ఆ టైమ్లో నన్నెవరూ ఆస్పత్రికి తీసు కెళ్లలేదని, నా ఆరోగ్యం గురించి ఎవరూ అడగలేదని అనుకుం టుంటాను. కానీ ‘సిటాడెల్: హనీ బన్నీ’ యూనిట్ సహకరించిం ది. నేను కోలుకున్నాక షూటింగ్ చేశారు’ అని చెప్పుకొచ్చింది సామ్.

ఇక విడాకుల తర్వాత సమంత తన సినిమాలతో బిజీగా మారిపోయింది.మాయోసైటిస్ తో బాధపడుతున్న సమంత చికిత్స తీసుకుంటుంది. కాగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. హెల్త్ పరంగా.. అలాగే మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు ఏడాది పాటు సినిమాలకు దూరం అయ్యింది సామ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు తిరిగి సినిమాలతో బిజీ కానుంది. ఇప్పటికే వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తోంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు , సిరీస్ లు చేస్తోంది. ఇప్పటికే హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించింది. ఇక ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటిస్తుంది సామ్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  China Virus: చైనా నుంచి కొత్త వైరస్.. నిజంగా అంత డేంజరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *