Salman Khan: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన ఆస్తుల విషయంలో తీసుకున్న నిర్ణయంతో చర్చనీయాంశమయ్యాడు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక బాంద్రా ప్రాంతంలోని శివ్ ఆస్తాన్ హైట్స్‌లో 1318 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్‌ను రూ.5.35 కోట్లకు అమ్మేశాడు. ఈ లావాదేవీకి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులతో కలిపి అదనంగా రూ.33 లక్షలు ఖర్చు కూడా అయినట్లు సమాచారం. బిగ్ బాస్ షో హోస్టింగ్‌తో ఒక్కో సీజన్‌కు రూ.250-300 కోట్లు సంపాదిస్తున్న సల్మాన్ ఈ ఫ్లాట్‌ను ఎందుకు అమ్మాడనే దానిపై ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
Also Read: Ranbir Kapoor: షాకిస్తున్న రణబీర్ కపూర్ సంపాదన!
బాంద్రాలో సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఫ్లాట్ అమ్మకం అనూహ్యం. ఆర్థిక ఇబ్బందులు లేని సల్మాన్ ఈ నిర్ణయం వెనుక వ్యాపార లాభమా లేక వేరే కారణమా అని బాలీవుడ్ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక సినిమాల్లో వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న సల్మాన్, తిరిగి స్టార్‌డమ్‌ను సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు.