Mumbai: సల్మాన్ ఖాన్ స్నేహితుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) సీనియర్ నేత, బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధిఖీ కన్నుమూశారు. కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ కాల్పులు జరగడం అందర్నీ కలవరానికి గురి చేసింది.