Bollywood Icons: బాలీవుడ్ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. అయితే బాలీవుడ్ మూవీలో కాదు హాలీవుడ్ సినిమాలో. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న అమెరికన్ త్రిల్లర్ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు.
సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన సీక్వెన్స్ లో కనిపించబోతున్నారట ఈ సీనియర్ స్టార్స్. ఇప్పటికే సౌదీలో ఈ ఇద్దరిపై సీన్స్ షూట్ చేస్తోన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు మేకర్స్.
ఇది కూడా చదవండి: Chennai: పాపం ఆమె.. అన్నం పెట్టడం లేటైందని భార్య గొంతు కోసిన భర్త..
సల్మాన్, సంజయ్ లకు బాలీవుడ్ లోనే కాదు మిడిలీస్ట్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అక్కడ సల్మాన్ సినిమాలు మిలియన్ కలెక్షన్స్ రాబడతాయి. ఇప్పుడు ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది హాలీవుడ్. గ్లోబల్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి ఈ హీరోలను ఫీల్ట్ లోకి దింపుతోంది.