Sailesh Kolanu: హిట్-3తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను మరోసారి సిద్ధమయ్యారు. ఈసారి యాక్షన్‌కు తాత్కాలిక విరామం ఇచ్చి, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం యూత్‌ను టార్గెట్ చేస్తూ, శైలేష్ మార్క్ స్టైలిష్ టచ్‌తో రూపొందనుంది. రొమాంటిక్ జోనర్‌లో శైలేష్ ఎలాంటి మాయాజాలం సృష్టిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. రోషన్‌తో కలిసి శైలేష్ ఎలాంటి లవ్ స్టోరీని తెరపైకి తీసుకొస్తారో చూడాలని యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం శైలేష్ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, రొమాన్స్‌తో బాక్సాఫీస్‌ను మళ్లీ రగిలించేలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

