Saidi Arabia:

Saidi Arabia: సౌదీ అరేబియాలో మారిన వాతావ‌ర‌ణం ప్ర‌పంచానికి ఓ హెచ్చ‌రిక‌

Saidi Arabia: సౌదీ అరేబియా అంటే ఎడారి దేశం అని ప్ర‌పంచ‌వ్యాప్తంగా పిలుచుకుంటారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక వాతావ‌ర‌ణ ఉంటే.. ఈ దేశంలో మ‌రోర‌కంగా ఉంటుంది. పావు వంతు భూభాగం ఉంటే.. మిగ‌తా ముప్పావు శాతం భూమి ఇసుక ఎడారిగా ఉంటుంది. క‌నీసం వ్య‌వ‌సాయానికి కూడా ఎలాంటి సాగు యోగ్యం కాని భూమి అది. వేస‌విలో అక్క‌డ మ‌రెక్క‌డా లేని రీతిలో 50 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ల కంటే అధికంగా న‌మోదు అవుతూ ఉంటుంది. ఇత‌ర కాలాల్లోనూ ఉష్ణోగ్ర‌త ఇత‌ర ప్రాంతాల కంటే అధికంగానే ఉంటుంది.

Saidi Arabia: వాతావ‌ర‌ణ‌ ప‌రిస్థితుల మార్పుల వ‌ల్ల ఇటీవ‌ల సౌదీ అరేబియాలో ప‌రిణామాలు గుబులు రేకెత్తిస్తున్నాయి. గ‌త వానకాలంలో తీవ్ర‌స్థాయిలో వ‌చ్చిన వ‌ర‌ద‌లే హెచ్చ‌రికను జారీ చేశాయి. తాజాగా ఉత్త‌ర సౌదీ అరేబియా మంచుతో త‌డిసి ముద్ద‌య్యాయి. ఇసుకు తిన్నెల‌పై మంచుదుప్ప‌టి ప‌రుచుకున్న‌ది. శీత‌ల ప్రాంతంలో ఉండే వాతావ‌ర‌ణం నెలకొన్నిది. మంచుమ‌యంగా మారిన సౌదీ ఎడారి ఫొటోలు, వీడియోలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌ల్‌గా మారాయి.

Saidi Arabia: సౌదీ అరేబియాలో ఏర్ప‌డిన వాతావ‌ర‌ణం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. భార‌త్ స‌హా ప‌లు దేశాల్లో కూడా వాతావ‌ర‌ణ మార్పులు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో అతివృష్టి, అనావృష్ఠి ఏర్ప‌డి మాన‌వ జీవితంపై ప్ర‌భావం ప‌డుతున్న‌ది. ప‌లు దేశాల్లో వ‌ర‌ద‌లు ప్ర‌మాద‌పూరితంగా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *