Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిట్ ఫండ్ బాధితుల సమస్యలపై స్పందించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈరోజు సాయంత్రం సచివాలయం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో, తన ఉండవల్లి నివాసం వద్ద కొంతమంది బాధితులు వచ్చారని తెలిపారు.
సాయి సాధన చిట్ ఫండ్ మోసంతో 600 మందికి నష్టం
బాధితులతో మాట్లాడిన చంద్రబాబు, వారు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందినవారని తెలిపారు. సాయి సాధన అనే చిట్ ఫండ్ కంపెనీ తమను మోసం చేసిందని, తమ కష్టార్జిత సొమ్ము పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
“ఈ ఘటనలో సుమారు 600 మంది నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును చిట్ ఫండ్ యాజమాన్యం మోసం చేసి లాక్కొనడంతో బాధితులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వారి బాధను నా దగ్గర వ్యక్తిగతంగా వివరించగా, వారి మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది.”బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు.
చిట్ ఫండ్ మోసపోయిన వారిని ఓదార్చిన చంద్రబాబు, వారికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని తెలిపారు.
మోసానికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం బాధితులకు న్యాయం జరిగేలా అన్ని సహాయ చర్యలు చేపడతాం రాష్ట్రంలో ఇకపై ఇలాంటి మోసాలు జరగకుండా కఠిన నిబంధనలు తీసుకురావడం ప్రభుత్వం కట్టుబడి ఉందిఅంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.
చిట్ ఫండ్ మోసాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం మరింత కఠినమైన చట్టాలు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బాధితుల నష్టపరిహారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగాచర్యలు తీసుకోనుంది.

