Sai Pallavi: తండేల్ మూవీ థియేటర్లలో పండగ వాతావరణం సృష్టిస్తుంది. నాగ చైతన్య కటౌట్స్, పోస్టర్లతో థియేటర్లను అందంగా అలంకరించారు. అయితే ఇదే సమయంలో టాలీవుడ్ చరిత్రలోనే ఏ హీరోయిన్ కి దక్కని గౌరవం సాయి పల్లవికి దక్కింది.
అదేంటంటే.. తండేల్ రిలీజ్ సందర్భంగా సాయి పల్లవి కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. 2024 జూన్ లో ఈ న్యాచురల్ బ్యూటీ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళింది.
ఇది కూడా చదవండి: Chocolate Day 2025: ఈ గిఫ్ట్ చాకలేట్ డే రోజున ఇచ్చారంటే మీ ఫ్రెండ్ సంతోషానికి తిరుగుండదు
అప్పటి నుంచి అక్కడి ఫ్యాన్స్ ఇలా ప్లాన్ చేసి ఫైనల్ గా వైజాగ్‌లోని సంగం థియేటర్ దగ్గర సాయిపల్లవి భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఓ హీరోయిన్ కు ఇలా కటౌట్ పెట్టడం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇదే తొలిసారి.
గతంలో ఏ హీరోయిన్ కు ఇలాంటి గౌరవం దక్కలేదు. సాయి పల్లవి కటౌట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సాయి పల్లవి నిజమైన లేడీ సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.