Sai Pallavi: పెదవులపై చిరునవ్వును సదా మెయిన్ టైన్ చేసే స్టార్ హీరోయిన్ సాయిపల్లవి… అవసరమైనప్పుడు తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంది. ఈ మధ్య తమిళనాట ‘అమరన్’ సక్సెస్ మీట్ లో శివకార్తికేయన్ చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన సాయిపల్లవి తాజాగా తెలుగులో ఇదే సినిమా సక్సెస్ మీట్ లో బదులు తీర్చుకుంది. శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ నంబర్స్ ను సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Janhvikapoor: హైదరాబాద్ ఆలయంలో నటి జాన్వీకపూర్ పూజలు
దాంతో శివ కార్తికేయన్ తమిళ వర్షన్ సక్సెస్ మీట్ లో ‘సాయిపల్లవికి తన ‘అమరన్’ ద్వారా తమిళంలో బ్లాక్ బస్టర్ దక్కడం ఆనందంగా ఉంద’ని వ్యాఖ్యానించాడు. ఇదే మాటలను తెలుగులో వర్షన్ సక్సెస్ మీట్ లో సాయి పల్లవి రిపీట్ చేసింది. ‘తమిళనాట తనకు సక్సెస్ శివ కార్తికేయన్ మూవీతో వస్తే… తెలుగులో ఆయనకు గ్రాండ్ సక్సెస్ తన కారణంగా లభించడం ఆనందంగా ఉంద’ని బదులిచ్చింది. ‘అమరన్’ తెలుగు వర్షన్ చూసిన వాళ్ళంతా క్లయిమాక్స్ లో సాయిపల్లవి నటనకు ఫిదా అయిపోతున్నారు. అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాతే సాయి పల్లవికి కితాబిస్తూ…. సినిమా చూసిన వెంటనే ఆమెతో కాసేపు మాట్లాడితే కానీ మనసు కుదుట పడలేదని వ్యాఖ్యానించారు. అలాంటి ఆమెకు… శివ కార్తికేయన్ తన కారణంగా తమిళంలో గ్రాండ్ సక్సెస్ లభించిందని చెప్పడం మనసుకు బాధ కలిగించినట్టుంది. అందుకే వెంటనే బదులిచ్చేసింది.