Sai Pallavi: లాంగ్వేజ్ ఏదైనా.. చేసే ప్రతి సినిమాకీ, అందులో తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకోవడం సాయి పల్లవి స్పెషాలిటీ.. తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో, ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ తో మెస్మరైజ్ చేసేస్తుందసలు.. ఈమధ్య అమరన్, తండేల్ సినిమాలతో ఆకట్టకుంది.. రామయణ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో సీతగా నటిస్తుందనగానే, నార్మల్ ఆడియన్స్ లోనూ అంచనాలు పెరిగిపోయాయి. దానికంటే ముందు ఏక్ దిన్ అనే హిందీ మూవీతో రాబోతోంది.. ఇప్పటివరకు మాతృభాష మలయాళం తర్వాత తెలుగు, తమిళ్ లో మాత్రమే మూవీస్ చేసిన సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.. డెబ్యూ ఫిలిం డిజాస్టర్ అవడంతో కొడుకుని హీరోగా నిలబెట్టాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు ఆమిర్ ఖాన్.. తనే నిర్మాతగా.. జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా.. సునీల్ పాండే డైరెక్షన్లో ఏక్ దిన్ అనే మూవీ చేస్తున్నాడు. జపాన్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీని నవంబర్ 7 రిలీజ్ చెయ్యబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్…రామాయణ కంటే ముందు రిలీజ్ అవబోతున్న సాయి పల్లవి ఫస్ట్ ఫిలిం ఇదే.

