Sai Dharam Tej

Sai Dharam Tej: ప్లాప్ డైరెక్టర్ తో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా?

Sai Dharam Tej: సాయి దుర్గ తేజ్.. విరూపాక్ష సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన యువ హీరో. ఆ తర్వాత బ్రో సినిమాలో నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో సంబరాల ఏటిగట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హనుమాన్ నిర్మాతలు కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం సాయి పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఆయన కొత్త లుక్ ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేసింది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. అదే సమయంలో సాయి మరో ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఫేమ్ వంశీ దర్శకత్వంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, వంశీ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు. సాయి ఈ సినిమాతో హిట్ కొడతారా? వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *