Sabitha Indra Reddy: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర వనితలు పుట్టిన ఈ నేలపై రాష్ట్ర ఆడబిడ్డలను ప్రభుత్వం అవమానించిందని ధ్వజమెత్తారు.
Sabitha Indra Reddy: తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం బాధాకరమని పేర్కొన్నారు. యావత్ మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 20 దేశాలకు చెందిన అందాల భామలు నిన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు.
Sabitha Indra Reddy: ఈ సమయంలో తెలంగాణ సంప్రదాయం ప్రకారం కట్టు, బొట్టుతో హాజరయ్యారు. వారు గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు, ఇత్తడి తాంబాళాలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఒక్కక్కరికి ఒక్కో యువతిని సహాయకురాలిగా ఎంపిక చేశారు. ఆ పోటీదారులు కాళ్లకు తెలంగాణ యువతులతో నీళ్లు పోయించి, కడిగించారు. తువాలుతో తుడిపించారు. ఇది తీరని అవమానకరమని సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు.