Sabarimala Temple: పవిత్ర మండల పూజ పూర్తయిన తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూసివేశారు. శబరిమల ఆలయంలో హరివరాసనం కార్యక్రమం అనంతరం శనివారం రాత్రి 10 గంటలకు మండల పూజాకాలం ముగింపును సూచిస్తూ ఆలయాన్ని మూసివేసినట్టు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తెలిపింది. చివరి రోజు అయ్యప్ప మాలధారులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.
Sabarimala Temple: డిసెంబర్ 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు పండుగ కోసం తిరిగి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. డిసెంబర్ 27వ తేదీ నాటికి సుమారు 30 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. ఈ సమయంలో రూ.333 కోట్ల ఆదాయం ఇప్పటి వరకు సమకూరినట్టు తెలిపారు.
