Sabarimala Temple: శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు నూతన డిజైన్‌ను రూపొందించారు. ఈ నూతన డిజైన్‌లో భాగంగా సన్నిధానం చుట్టూ 1989లో ఏర్పాటుచేసిన ఫ్లైఓవర్‌ను తొలగించనున్నారు. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే స్వామి సన్నిధిలోకి అనుమతిస్తారు. ఇప్పటివరకు పదునెట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ వంతెనను తొలగించనుండటంతో మెట్లు ఎక్కగానే స్వామివారి నిజరూప దర్శనభాగ్యం కలుగుతుంది.
Sabarimala Temple: వచ్చే మార్చి నెల 14వ తేదీన మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. అప్పుడు ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు లేదంటే నాలుగు లైన్లు దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్‌పుర (కణిక్కవంచి-నైవేద్యపాత్ర) మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు.
Sabarimala Temple: ప్రస్తుతం వంతెన దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమవైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే రెండు మూడు సెకన్లపాటు స్వామిదర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం మాత్రం కూడా దక్కేది కాదు. తాజా డిజైన్‌తో కణిక్కవంచి నుంచి వెళ్లే 30 సెకన్ల నుంచి నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం లభిస్తుంది.
