Russian Plane: తూర్పు అముర్ ప్రాంతంలో రష్యాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల విమానం అదృశ్యమైంది. An-24 మోడల్ విమానంలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 40 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.
ఎయిర్ ట్రాఫిక్‌తో సంబంధం కోల్పోయింది
ఖబరోవ్స్క్ – బ్లాగోవెష్‌చెన్స్క్ – టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. టిండా పట్టణం సమీపంలో రెండవ ల్యాండింగ్ ప్రయత్నం చేస్తున్న సమయంలో విమానం అకస్మాత్తుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధం కోల్పోయింది. విమానాశ్రయం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌పాయింట్ వద్ద కూడా విమానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు.
ఘటనపై అధికారులు ఆందోళన
“టిండా విమానాశ్రయానికి దగ్గరగా వస్తూ భద్రతా తనిఖీలను పాస్ చేయలేకపోయింది. దానితో ఎటువంటి సంబంధం లేదు” అని అత్యవసర సేవల అధికారులు తెలిపారు.
గతంలో కూడా ఇలాంటి సంఘటన
ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో, జెయా జిల్లాలో ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న రాబిన్సన్ R66 హెలికాప్టర్ కూడా అదృశ్యమైంది.
ప్రస్తుతం శోధక బృందాలు ఆ ప్రాంతంలో వెతికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రయాణికుల సురక్షితంపై కుటుంబాలు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Air traffic controllers lost contact with an An-24 passenger aircraft carrying around 50 people in Russia’s Far East on Thursday, according to reports from Interfax and SHOT.
The plane, operated by Angara Airlines, was en route to Tynda in the Amur region, which borders China.… pic.twitter.com/mWW79yfoRn
— News9 (@News9Tweets) July 24, 2025

