Russia-Ukraine War: ఒకవైపు కాల్పుల విమరణ కోసం మంతనాలు సాగుతున్నా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు తెగబడుతున్నది. తాజాగా ఉక్రెయిన్‌లోని కీవ్‌పై 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో రష్యా సైనికులు విరుచుకుపడినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో అనేక భవనాలు, ఆసుపత్రులు, వాహనాలు ధ్వంసమైనట్టు తెలిపారు. ఈ దాడుల్లో శిథిలాల కింద అనేక మంది చిక్కుకొని ఉంటారని ఆందోళన చెందుతున్నారు.
Russia-Ukraine War: అదే విధంగా రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపైనా దాడులకు దిగాయి. 20కిపైగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులతో దాడులకు దిగినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా, పలువురు తీవ్రగాయాల పాలైనట్లు ఆదేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు.
Russia-Ukraine War: రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లోని ఈశాన్య సుమీ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని జెలెన్ స్కీ వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. యుద్ధం సమయంలో తమకు అండగా ఉంటూ ఆయుధాలను సరఫరా చేస్తున్న మిత్ర దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.