Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లను టారిఫ్‌ల ద్వారా బెదిరించడాన్ని పుతిన్ తీవ్రంగా ఖండించారు. బీజింగ్‌లో జరిగిన ఒక సైనిక ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పరిపాలన భారత్, చైనాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ రెండు దేశాలు తమకు “భాగస్వాములు” అని చెబుతూనే, వాటి నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశం 150 కోట్లకు పైగా జనాభాతో, చైనా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఉన్నాయని, వాటికి సొంత చట్టాలు, వ్యవస్థలు ఉన్నాయని పుతిన్ గుర్తు చేశారు.
పుతిన్ తన ప్రసంగంలో వలసవాదం (colonialism) అనేది ఒక పాత పద్ధతి. ఆధునిక ప్రపంచంలో భాగస్వామ్య దేశాలపై అలాంటి పద్ధతులను ప్రయోగించడం సరైంది కాదు అని స్పష్టం చేశారు. భారతదేశం, చైనాలు తమ సార్వభౌమత్వం కోసం వలసవాదులతో సుదీర్ఘ పోరాటం చేశాయని, అలాంటి దేశాల నాయకత్వం బలహీనంగా ఉంటే వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు. ట్రంప్‌కు ఈ దేశాలపై సరైన అవగాహన లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Also Read: Nepal: నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం, అసలు కారణం ఇదే!
చైనా పర్యటనలో ఉన్నప్పుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. మానవ జీవిత కాలం ఎంత అనే అంశంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. సైన్స్ అభివృద్ధి చెందుతున్నందున, మానవ అవయవ మార్పిడితో ప్రజలు 150 ఏళ్లు కూడా జీవించవచ్చని పుతిన్ అభిప్రాయపడగా, జిన్‌పింగ్ నవ్వినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది.
అలాస్కాలో జరిగిన ఒక సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్‌కు జరిగిన చర్చల గురించి తాను మోదీకి వివరించినట్లు పుతిన్ తెలిపారు. ఈ చర్చలో ఎటువంటి రహస్యం లేదని, కేవలం 30 సెకన్ల పాటు ట్రంప్‌తో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే అంశంపై ట్రంప్‌తో తాను మాట్లాడినప్పుడు, ట్రంప్ ఆరోగ్యం బాగుందని చెప్పినట్లు పుతిన్ వివరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.