Rupali Ganguly: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆప రేషన్ సిందూర్ ‘పై పాక్ నటుడు ఫవాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఫైర్అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఫవాద్ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది. ‘మీలాంటి వారు భారతీయ సినిమాల్లో వర్క్ చేయడం మాకు సిగ్గుచేటు’ అని అతడి ఫొటోను షేర్ చేసింది.
ఈ పోస్ట్ కు ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ హ్యాష్ ట్యాగ్ ను ఏడ్చేసింది. ఇక ‘ఆపరేషన్ సిందూర్’పై పాకిస్తానీ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ చేసిన కామెంట్లను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా ఖండించింది. వారిని తక్షణమే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటివారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది.
ఇది కూడా చదవండి: IMF Loan: భారత్ వద్దన్నా.. పాకిస్థాన్ కి రూ.8వేల కోట్లు అప్పు ఇచ్చారు..
మరోవైపు పహల్గాంలో దాడి జరిగిన తర్వాత ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే యూట్యూబ్ (ఇండియా)లో ఈ మూవీ సాంగ్స్ తొలగించారు. అంతకుముందు ఫవాద్ ‘కపూర్ & సన్స్, ఏ దిల్ హై ముష్కిల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించారు.
కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫవాద్ఖాన్ ఇన్స్టా వేదికగా స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే, రెచ్చగొట్టే మాటలతో అగ్నికి ఆజ్యం పోయొద్దంటూ వ్యాఖ్యానించాడు. అమాయక ప్రజల ప్రాణాలకు విలువలేదన్నాడు. అంతేకాదు, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించటం తీవ్ర వివాదాస్పదమైంది.
