Spirit

Spirit: స్పిరిట్‌లో రణబీర్ క్యామియోపై క్లారిటీ?

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా లాంచ్ అయిన వెంటనే ఓ భారీ రూమర్ వైరల్ అయింది. ఈ చిత్రంలో ‘అనిమల్’ హీరో రణబీర్ కపూర్ మ్యాడ్ క్యామియో చేస్తాడని టాక్. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: iBomma Ravi: భార్యతో ఒప్పందం.. ఇమంది రవి పోలీస్ కస్టడీలో కీలక విషయాలు

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’. ఈ సినిమా లాంచ్ అయిన కొద్ది రోజులకే సోషల్ మీడియాలో ఒక రూమర్ తెగ వైరల్ అయింది. ఈ చిత్రంలో సందీప్ వంగా ‘అనిమల్’ హీరో రణబీర్ కపూర్‌ను మ్యాడ్ క్యామియోలో చూపించబోతున్నాడని, బహుశా రెండు సినిమాలకు క్రాస్ ఓవర్ ఉంటుందని టాక్ వ్యాపించింది. కానీ ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ వార్తలు పూర్తిగా అపోహలే. ‘స్పిరిట్’ ప్రభాస్‌కు ప్రత్యేకంగా సందీప్ వంగా సృష్టించిన సొంత వరల్డ్. అనిమల్‌తో ఎలాంటి కనెక్షన్ లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ రూమర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచేసింది. అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *