Spirit

Spirit: స్పిరిట్ సినిమాలో సంచలన మార్పు.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?

Spirit: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జోరందుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోణ్ తొలగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్ ఊహించని ట్విస్ట్‌గా సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

Also Read: Kothalavadi: ‘కొత్తలవాడి’తో యష్ తల్లి సినీ ప్రవేశం.. వైరల్ అవుతున్న టీజర్‌!

Spirit: ఈ భారీ యాక్షన్ డ్రామాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా, టీ-సిరీస్, భద్రకాళి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్-సందీప్ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. రుక్మిణి ఎంపిక నిజమైతే, ఈ చిత్రం మరింత ఆసక్తికరంగా మారనుంది. త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  RC16 సెట్ లో పాల్గొన్న బాలీవుడ్ వైరల్ స్టార్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *