ap news: ఆర్టీసీ నడుపుతుండగా అకస్మాత్తుగా డ్రైవర్‌కు గుండుపోటు.. బస్సులో 60 మంది ప్రయాణికులు.. వారి ప్రాణాల రక్షణే కండ్లముందు కనిపించింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రోడ్డు పక్కన పొలాల్లోకి మళ్లించిన డ్రైవర్.. ముందు వెళ్తున్న సైకిల్‌కు ఢీకొని అతనికి గాయాలు.. ఈలోగా ప్రాణాలిడిసిన డ్రైవర్.. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేపల్లె, చీరాల పట్టణాల మధ్యన చోటు చేసుకున్నది. తమ ప్రాణాలు కాపాడి డ్రైవర్ ప్రాణాలిడిసిన ఘటనపై ప్రయాణికులు కంటనీరు పెట్టుకున్నారు.
ap news: బాపట్ల ఆర్టీసీ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాలకు బుధవారం ఉదయం 60 మంది ప్రయాణికులతో వెళ్తున్నది. బస్సు నడుపుతుండగా ఆ బస్సు డ్రైవర్ డీ.సాంబశివరావుకు గుండెపోటు వచ్చింది. గుండెను మెలి పెడుతున్న బాధను దిగమింగుతూ ప్రయాణికుల ప్రాణాలే తన బాధ్యత అనుకున్నాడు. డ్రైవర్‌గా కర్తవ్యధర్మాన్ని పాటించాలనుకున్నాడు. చాకచక్యంగా పక్కనున్న పొలాల్లోకి బస్సును మళ్లించాడు. ఈ లోగా గుండుపోటు పెరిగి బస్సులోనే డ్రైవర్ ప్రాణాలిడిచాడు.
ap news: బస్సు పొలాల్లోకి దూసుకెళ్లే క్రమంలో ముందుగా వెళ్తున్న సైకిల్‌ను ఢీకొనడంతో దానిపై వెళ్తున్న పిట్టు వెంకటేశ్వరరెడ్డి కాలికి తీవ్ర గాయమైంది. డ్రైవర్ విధ్యుక్త ధర్మం పాటించడంతో బస్సులోని 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

