RTC Bus: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పోతునూరు గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది . తెల్లవారుజామున AP 40 Z 0058 నంబర్ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ బస్ హైదరాబాద్ నుండి ఏలూరు వస్తుండగా మార్గమధ్యంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఏలూరుకి చెందిన పెందుర్తి. విమలాబాయ్ (72)అనే వృద్ధురాలు ఘటనా స్థలంలో మృతి చెందింది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర మీడియాకు తెలిపారు.
