RS Praveen Kumar: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. హరీష్ బాబు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు.
“హరీష్ బాబు రేవంత్ రెడ్డితో కుమ్మక్కై సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు” అని ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అక్రమ ఆస్తుల విలువ రూ.25 కోట్లు అయితే, ఒక ఇంజనీర్ ఇంట్లోనే రూ.200 కోట్లు దొరికాయి అని హరీష్ బాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
“సిర్పూర్ నియోజకవర్గంలో ఆయుష్మాన్ కేంద్రాలను మూసివేసి, ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేసి, మీ సొంత ‘ప్రజా లైఫ్ కేర్’ ఆసుపత్రిలో పేద ప్రజలను దోచుకోవడానికి మీరు చేసేదే అసలైన కుట్ర” అని ప్రవీణ్ కుమార్ హరీష్ బాబుపై మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి హరీష్ బాబు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

