Telangana: ఒక పక్క ఆకలి . మరో పక్క చేతిలో 23లక్షలు. బ్యాగ్ బస్సు లో పెట్టి పొతే ఎవరన్నా కొట్టేస్తారు అని భయం. బస్సు దిగకపోతే కడుపులో ఆకలి. ఎలా ? సరే మన బ్యాగ్ లో డబ్బు ఉంది అని ఎవరికీ తెలుసు అని బాగ్ బస్సులోనే పెట్టి కిందకు దిగాడు. ఫాస్ట్ ఫాస్ట్ గా తిని బస్సు ఐతే ఎక్కాడు. కానీ బాగ్ ఉంది కానీ ..బ్యాగ్లో మనీ లేదు. జస్ట్ నిమిషాలలోనే డబ్బు మాయం ..ఎలా అలా ? పోలీసులకు ఐతే చెప్పాడు ..సర్ కొంచెం డబ్బు వెతికి పెట్టమని
చిన్న గ్యాప్ దొరికినా పని కానిచ్చేస్తున్నారు దొంగలు. ఇల్లు, బస్సు, కారు, బైకు అని ఏం తేడా లేదు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా దొరికిన కాడికి దోచేస్తున్నారు. ఎలా చూస్తున్నారో కానీ.. బైకులో పెట్టిన డబ్బులు దగ్గరి నుంచి కారులో పెట్టిన పైసలు కూడా అద్దాలు పగలగొట్టి మరీ చోరీ చేసిన ఘటనలు చూశాం. అయితే.. ఇప్పుడు ఏకంగా ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో నుంచి రూ.23 లక్షలున్న బ్యాగును కొట్టేశారు దొంగలు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ఈ చోరీ జరిగింది.
ఇది కూడా చదవండి: Meerpet Murder: మీర్‌పేట మహిళ హత్యకేసులో మరో ముగ్గురి హస్తమున్నదా? వెలుగులోకి సంచలన విషయాలు
బాపట్లకు చెందిన వెంకటేష్ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. కాగా.. వెంకటేష్ తనతో బ్యాగులో రూ.23 లక్షలు తీసుకెళ్తున్నాడు. అయితే.. ప్రయాణికులు టిఫిన్ చేసేందుకని బస్సును నార్కట్‌పల్లి సమీపంలోని ఓ హోటల్ దగ్గర ఆపగా.. సదరు వ్యక్తి బ్యాగును బస్సులోనే పెట్టి టిపిన్ కోసం కిందికి దిగాడు. బ్యాగులో డబ్బు ఉన్న విషయం ఎవ్వరికీ తెలియదు కదా అన్న ధీమాతో దిగాడే కానీ.. మనసంతా ఆ బ్యాగుపైనే ఉంది వెంకటేష్‌కు. దీంతో.. గబగబా టిఫిన్ చేసి అందరికంటే ముందే బస్సు ఎక్కేశాడు వెంకటేష్. తీరా తన సీటు దగ్గరికి వెళ్లి చూసేసరికి.. మనసుల ఏదైనా భయం గట్టిగా తన్నుతుందో అచ్చంగా అదే జరిగింది. రూ.23 లక్షలున్న బ్యాగ్ కనిపించలేదు.
తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు.. అందరి ప్రయాణికులను అడిగాడు. బస్సు డ్రైవర్‌తో పాటు అక్కడున్న అందరినీ ఆరా తీశాడు. హోటల్ పరిసర ప్రాంతాల్లో కూడా వెతికాడు. వెంకటేశ్‌కు అక్కడున్న ప్రయాణికులు కూడా సాయం చేశారు. కానీ.. ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. దీంతో.. చేసేదేమీలేక నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల్లో ఓ వ్యక్తి అనుమానంగా కనిపించటంతో.. అతని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
