RRR Live Concert

RRR Live Concert: లండన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సంగీత హంగామా.. ఎన్టీఆర్‌-చరణ్‌తో రాజమౌళి రచ్చ!

RRR Live Concert: తెలుగు సినిమా సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరోసారి ప్రపంచ గుండెల్లో గూడు కట్టింది. ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్‌ అందుకున్న ఈ చిత్రం, లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో నిర్వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’తో సంగీత ప్రియులను అలరించింది. ఎం.ఎం. కీరవాణి సంగీత ప్రదర్శన అతిథులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో అభిమానులు కేకలతో హోరెత్తించారు. సోషల్‌ మీడియాలో హీరోల ఫొటోలు వైరల్‌ అవుతూ అభిమానుల నుంచి పాజిటివ్‌ కామెంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఈ ఈవెంట్‌ తెలుగు సినిమా స్థాయిని మరోసారి చాటింది. ఇదిలా ఉంటే, రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌ బాబుతో భారీ బడ్జెట్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Conclave On Education: మా ఇంట్లో ముగ్గురికి.. తల్లికి వందనం ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *