RRR: ఇప్పటికే ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా ఎగురవేసిన సినిమా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మూవీ పలు రికార్డ్ లతో పాటు అవార్డులను దక్కించుకుని ఠీవిగా నిలబడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్ ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్ర్కీనింగ్ కాబోతోంది. దీనికి ముందు రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెష్ర్టాతో సంగీత దర్శకుడు కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇస్తారు. దీనికి ముదు
RRR: అక్టోబర్19, 2019లో ‘బాహుబలి: ద బిగినింగ్’ ఇదే రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితం అయింది. అయితే అప్పట్లో తెలుగు వెర్షన్ కాకుండా హిందీ వెర్షన్ స్క్రీనింగ్ కావటం తెలుగువారిని బాగా నిరాశకు గురిచేసింది. అయినా అలా ప్రదర్శితం అయిన నాన్ ఇంగ్లీష్ మూవీ గా ‘బాహుబలి’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఏదేమైనా ఈసారి వచ్చే ఏడాది రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు వెర్షన్ లో ప్రదర్శితం అయి తెలుగువారి గౌరవాన్ని రెట్టింపు చేస్తుందేమో చూద్దాం.

