RRR: భీమవరం డీఎస్పీ జయసూర్యపై వస్తున్న విమర్శల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జయసూర్య ఓ మంచి అధికారి అని, ఆయన గురించి పవన్ కల్యాణ్‌కు ఎవరేం చెప్పారో తనకు తెలియదని స్పష్టం చేశారు.
గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం సహజమని, “13 ముక్కలాట నేరం కాదు” అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. అయితే, పేకాట వంటి జూదాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఇటీవల కాలంలో భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు జరగడం లేదని ఆయన తెలిపారు.రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ప్రస్తుత భీమవరం డీఎస్పీపై జరుగుతున్న చర్చకు కొత్త మలుపు తిప్పాయి.