RRB:

RRB: నిరుద్యోగుల‌కు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌.. 22 వేల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

RRB: రైల్వేశాఖ‌లో చాలా కాలం త‌ర్వాత భారీ నోటిఫికేష‌న్ రానే వ‌చ్చింది. ఇప్ప‌టికే వివిధ గ్రూప్‌ల ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌లు కొన‌సాగుతుండ‌గా, తాజాగా ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పోస్టుల కోసం సుమారు 22,000 ఖాళీలు ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ నియామ‌క ప్రక్రియ‌లో భాగంగా 2026 జ‌న‌వ‌రి 21 నుంచి 2026 ఫిబ్ర‌వ‌రి 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని రైల్వేశాఖ పేర్కొన్న‌ది.

RRB: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-బీ పోస్టుల కోసం 10వ త‌ర‌గ‌తి, ఐటీఐ అర్హ‌త అవ‌స‌రం అని ఆ శాఖ పేర్కొన్న‌ది. వేత‌నం కింద రూ.18,000 బేసిక్ పేతోపాటు ఇత‌ర అల‌వెన్సుల‌తో మొద‌లై ఏటేటా పెరుగుతూ ఉన్న‌ది. ఆర్ఆర్‌బీ గ్రూప్‌-బీ లెవ‌ల్‌-1 కింత ఈ పోస్టు ల‌నియామ‌కం ఉంటుంద‌ని నోటిఫికేష‌న్‌లో రైల్వేశాఖ‌ పేర్కొన్న‌ది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌, ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో సంప్ర‌దించ‌గ‌లరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *