Joe Root: భారత్ తో జరుగుతోన్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ సెంచరీతో మెరిశాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన నాల్గవ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ది ఓవల్ లో జరుగుతోన్న ఈ చివరి టెస్ట్ లో 137 బంతుల్లో సెంచరీ చేసిన జో రూట్ తన కెరీర్ లో 39వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. దీనితో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర 38 సెంచరీల రికార్డును అధిగమించాడు. భారత్ తో జరిగిన నాల్గవ టెస్ట్ లో సంగక్కర రికార్డును సమం చేసిన జో రూట్ ఈ మ్యాచ్ లో సెంచరీతో అతనిని అధిగమించాడు. రూట్ భారత్‌పై 13 సెంచరీలు చేశాడు.
అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో, సచిన్ టెండూల్కర్ (51), జాక్వెస్ కాలిస్ (45), రికీ పాంటింగ్ (41) మాత్రమే జో రూట్ (39) కంటే ముందున్నారు. చివరి టెస్ట్‌లో 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ మూడు వికెట్లకు కేవలం 106 పరుగులకే ఆలౌటైంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జో రూట్, హ్యారీ బ్రూక్ (111)తో కలిసి నాల్గవ వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు.
ఇది కూడా చదవండి: Shubman Gill: చాలా తక్కువ మందికి ఇస్తా.. గిల్‌కు గావస్కర్ గిప్ట్!
ఈ ప్రక్రియలో, జో రూట్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై అత్యధికంగా 500+ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. 2021-22లో భారత్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో జో రూట్ 737 పరుగులు చేశాడు. 2014లో భారత్‌పై జరిగిన ఏడు ఇన్నింగ్స్‌లలో 518 పరుగులు, ఇటీవలి సిరీస్‌లో 500+ పరుగులు చేశాడు. జో రూట్ 2012లో నాగ్‌పూర్‌లో భారత్‌తో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అతను 3383 పరుగులు చేశాడు.