Coolie: సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘కూలీ’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్‌కు సమాయత్తమవుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కేమియో గురించి సినీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ నడుస్తోంది.
లోకేశ్ గతంలో ‘విక్రమ్’లో సూర్య రోలెక్స్ పాత్రతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఇప్పుడు ‘కూలీ’లో అమీర్ ఖాన్‌తో సమానమైన ఇంపాక్ట్‌ఫుల్ కేమియోను ప్లాన్ చేశారని టాక్. సినిమా క్లైమాక్స్‌లో కనిపించే ఈ పాత్ర ఫ్యాన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని చిత్ర బృందం వెల్లడించింది. రజినీ-అమీర్ కాంబినేషన్ సీన్ సినిమాకు మేజర్ హైలైట్ కానుంది. ఈ భారీ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రజినీ హవా, లోకేశ్ మేకింగ్, అమీర్ సర్‌ప్రైజ్‌తో ‘కూలీ’ థియేటర్స్‌లో సంచలనం సృష్టించడం ఫిక్స్!
