Rohit Sharma: 11 కిలోల బరువు తగ్గి.. సరికొత్త లుక్‌లోకి

Rohit Sharma: భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి, అంతర్జాతీయ కెరీర్‌ను మరింత పొడిగించేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్, ఇప్పటికే 11 కిలోల బరువు తగ్గి సరికొత్త లుక్‌లోకి మారాడు.

హిట్‌మ్యాన్‌ ఫిట్‌నెస్ మార్పుపై ఆయన వ్యక్తిగత కోచ్‌ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రోహిత్ శర్మ ఇంకా బరువు తగ్గుతాడు. అతని కసరత్తులు చూస్తుంటే ఒక బాడీబిల్డర్‌లా ఉన్నాడు. రాబోయే సౌతాఫ్రికా సిరీస్‌లో మరింత స్లిమ్‌గా కనిపిస్తాడు,” అని నాయర్ వెల్లడించాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు మూడు నెలలపాటు రోహిత్‌తో కలిసి శిక్షణ ఇచ్చిన అభిషేక్ నాయర్ మాట్లాడుతూ, “రోహిత్ తన ఇష్టమైన వడాపావ్ తినడానికీ దూరమయ్యాడు. ఆహార నియమాలు కఠినంగా పాటిస్తున్నాడు. రోజుకు గంటల కొద్దీ జిమ్‌లో శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్‌పై ఇంత శ్రద్ధ పెట్టడం వల్లే అతనిలోని మార్పు అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది,” అని చెప్పారు.

తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీతో కలిసి 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను 9 వికెట్ల తేడాతో ఘన విజయానికి నడిపించాడు.

గత రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు, ఈ విజయంతో క్లీన్‌స్వీప్ ముప్పు నుంచి బయటపడింది. రోహిత్ ఫిట్‌నెస్ మార్పు, బ్యాటింగ్ కుదురుతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *