Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు చెప్పడంతో అభిమానుల్లో కలకలం రేగింది. రోహిత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వార్తను ప్రకటించారు.
67 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రోహిత్ శర్మ, మొత్తం 4,301 పరుగులు చేశారు. ఇతడి బ్యాటింగ్ శైలి, ఓపెనర్‌గా సాధించిన విజయాలు భారత క్రికెట్‌కు కీలకంగా నిలిచాయి. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై అతని ప్రదర్శన గుర్తుంచుకోవాల్సినదే.
రిటైర్మెంట్ ప్రకటనలో రోహిత్ శర్మ, “టెస్ట్ క్రికెట్‌లో నేను గడిపిన ప్రతి క్షణం నాకు అమూల్యమైనది. జాతీయ జెండాను ధరించి, తెల్ల దుస్తుల్లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది. ఈ నిర్ణయం సులువు కాదు కానీ సమయం వచ్చిందనిపిస్తోంది,” అని పేర్కొన్నారు.
అయితే, వన్డే క్రికెట్‌లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. రానున్న మెగాటోర్నమెంట్లలో జట్టుకు సహాయపడటమే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఆయన నిర్ణయం భారత క్రికెట్‌కు గుణాత్మక మార్పుకు నాంది కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.