Robinhood: సంక్రాంతి కి మూడు సినిమాలే వస్తున్నాయి. ఇది ఇప్పటి వరకూ వినవచ్చిన మాట. అయితే ఇప్పుడు సీన్ మారింది. రంగంలోకి మైత్రీ దిగింది. మామూలుగా అయితే మైత్రీ వారు అజిత్ తో తీస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికి రావలసింది. షూటింగ్ లో జాప్యం వల్ల వర్క్ పూర్తి కాకపోవడంతో అది జరగలేదు. సంక్రాంతికి వచ్చే మూడు సినిమాలతో దిల్ రాజుకు సంబంధం ఉంది. రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు బాలయ్య సినిమాను పంపిణీ చేస్తున్నాడు. దాంతో సంక్రాంతి దిల్ రాజుదే అనుకుంటుండగా మైత్రీ స్కెచ్ వేసింది. డిసెంబర్ 20న రిలీజ్ కావలసిన ‘రాబిన్ హుడ్’ను పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు సంక్రాంతికి రంగంలోకి దింపుతోంది.
Robinhood: ఓ విధంగా ఇది గ్యాంబ్లింగ్ అయినా రిస్క్ తీసుకుంటోంది మైత్రీ సంస్థ. నితిన్, వెంకీ కుడుముల కాంబోకి తోడు శ్రీలీల హీరోయిన్ కావటం, పాటలకు మంచి స్పందన రావటంతో పోటీకి సై అంటోంది. జనవరి 13న ‘రాబిన్ హుడ్’ను రిలీజ్ చేయబోతున్నారట. అజిత్ మూవీ కోసం బ్లాక్ చేసిన థియేటర్లలో ‘రాబిన్ హుడ్’ను దించబోతున్నారట. దానికి తోడు ‘పుష్ప2’ రిలీజ్ చేసిన థియేటర్లు అప్పటికి కొన్ని ఫ్రీ అవుతాయి. దాంతో ధైర్యంగా ముందడుగు వేస్తోంది మైత్రీ. మరి మైత్రీ చేస్తున్న ఈ రిస్క్ వారికి సత్ఫలితాన్ని అందిస్తుందేమో చూడాలి.
