Road Accident

ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గాలిలో పల్టీకొట్టిన కారు.. మహిళ మృతి 

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక చిన్నారి గాయాల పాలైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ నుంచి ఒక కుటుంబం కారులో ఈసీఐఎల్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గరలో కారు డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఆ సమయంలో కారు వేగంగా ఉన్నట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. మరణించిన మహిళ గాయపడిన చిన్నారి తల్లిగా పోలీసులు గుర్తించారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: సరోజినీ దవాఖానకు క్యూ కట్టిన జనం.. దీపావళి పండుగే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *