Road Accident:పుణ్యస్నానాలు చేసి తిరిగి వస్తుండగా, తీవ్ర విషాదం నెలకొన్నది. మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తెలుగు భక్తులు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. జాతీయ రహదారి-30పై మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వారంతా తొలుత ఏపీ వాసులుగా గుర్తించిన అక్కడి పోలీసులు.. ఆ తర్వాత
వారిని తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించారు. వారి గుర్తింపు కార్డులను పరిశీలించగా, హైదరాబాద్ నగరంలోని నాచారం, తదితర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తున్నది. పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.
నోట్: ఈ వార్త అప్‌డేట్ అవుతుంది.