Road Accident: హైదరాబాద్ నగర పరిధిలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. దీంతో ఎందరో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు ఒకేరోజులో పదుల సంఖ్యలో కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడంతోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తేల్చుతున్నారు. పలుచోట్ల మైనర్లు కూడా వాహనాలు నడుపుతూ మృత్యువు పాలవుతున్నారు.
Road Accident: హైదరాబాద్ నగరంలో బహదూర్‌పుర నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ఇటీవలే ప్రారంభమైంది. ఆ రోడ్డుపై నుంచి అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పింది. ముగ్గురు మైనర్లు నడుపుతున్న ఆ బైక్ ఒక్కసారిగా విద్యుత్ పోలును ఢీకొని, డివైడర్‌కు తగిలడంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలిడిచారు.
Road Accident: అతివేగమే ఆ ముగ్గురి ప్రాణాలను బలిగొన్నదని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. మృతి చెందిన ముగ్గురూ బహదూర్‌పురాకు చెందిన మైనర్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురి మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

