Road Accident:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్ కల్ మండలం గణేష్ పూర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పొలం పనులకు వెళ్లి రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు వేగంగా ఢీకొట్టడంతో గణేష్ పూర్ కు చెందిన సిద్ధ రామప్ప(71) అతని కూతురు రేణుక(36), అల్లుడు జగన్నాథ్(41) సహా మనవడు వినయ్ కుమార్(15) మృతి చెందారు. ప్రమాదంలో అక్కడికక్కడే సిద్ధ రామప్ప మృతిచెందగా తీవ్రంగా గాయపడిన జగన్నాథ్, రేణుక, వినయ్ కుమార్ కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఘటనపై హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.