Road Accident: యువరక్తం …చాలా జోష్ మీద ..మనకు ఏమవుతుంది లే..అని కాన్ఫిడెన్స్ . మంచిదే…కానీ ఆ కాన్ఫిడెన్స్ కు…ఒక క్లారిటీ ఉండాలి. లేకుంటే …చాలా ప్రమాదం. అలా ఆ క్లారిటీనే ఇక్కడ మిస్ అయింది . అలా మిస్ అవ్వడం వాళ్ళ ఏమి జరిగిందో తెలుసా ? తన్న బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లితండ్రులకు కడుపుకోత మిగిలింది.
యాదాద్రి జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి కొందరు వ్యక్తులు కారులో పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీళ్లు ప్రయాణిస్తున్న కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో ఈ ఘోరం జరిగింది. మృతి చెందిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఆరుగురు యువకులతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది.
Road Accident: స్పాట్‌లోనే ఐదుగురు చనిపోతే… ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన పేరు మణికంఠ. ఎల్బీనగర్‌కు చెందిన వంశి,దిగ్నేశ్,హర్ష ,బాలు,వినయ్ లు పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మణికంఠ సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు పోస్ట్ మార్టానికి పంపించారు. అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.
ఈ కుర్రాళ్లంతా రాత్రి పార్టీ చేసుకున్నారు. ఫుల్‌గా మద్యం తాగారు. అక్కడి సంతృప్తి చెందకుండా ఉదయాన్నే కల్లు తాగాలని అనుకున్నారు. వెంటనే కారు వేసుకొని పోచంపల్లి బయల్దేరారు. అక్కడి వరకు బాగానే వెళ్లిన జలాల్‌పూర్ వెళ్లేసరికి వారి కారు ప్రమాదానికి గురైంది. మద్యం మత్తులో కారు నడపడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్దారించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ మణికంఠ అనే వ్యక్తికి పరీక్షలు చేయగా మద్యం సేవించినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు.
Road Accident: మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన టూ వీలర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. రాయల్ ఎన్ఫీల్డ్ బండిని వేగంగా నడిపిన కుర్రాళ్లు అదుపు చేయలేక విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ దుర్ఘటనలో కార్తీక్ రెడ్డి స్పాట్‌లోనే చనిపోయాడు. అదే ప్రమాదంలో గాయపడిన మరో యువకుడు అనిల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.