Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొనడంతో 4 మంది మృతి చెందారు. లక్నో పోలీస్ స్టేషన్ సమీపంలో గత రాత్రి రెండు కార్లు, ఓమ్నీ వ్యాన్, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే నుజ్జునుజ్జయ్యారు.11 మందికి పైగా గాయపడ్డారు. అర్ధరాత్రి జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రులను రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
Accident: ప్రమాదస్థలికి సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఎలాంటి సమాచారం వెలువడలేదు. అయితే భారీ మంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Accident: ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలికి వెళ్లి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.