Rajasthan: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా-మనోహర్‌పూర్ రహదారిపై ఒక పికప్ వాహనం కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దౌసా-మనోహర్‌పూర్ రహదారిపై ఒక పికప్ వాహనం కంటైనర్ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదం బాందీకుయి పట్టణానికి సమీపంలో ఉన్న పండిత్‌పురా గ్రామం వద్ద జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతులలో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. తొమ్మిది మందికి గాయాలు కాగా, వారిలో ముగ్గురిని దౌసా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
మిగతా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో జైపూర్‌లోని SMS ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఖాటూ శ్యామ్ దేవాలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ఈ దుర్ఘటనపై దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ స్పందిస్తూ.. ప్రాథమిక నివేదికల ప్రకారం 10 మంది మరణించారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

