Road Accident: వాయువ్య పాకిస్థాన్‌లో శనివారం రాత్రి వాహనం కాలువలో పడిపోవడంతో కనీసం ఏడుగురు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బునెర్ జిల్లాలో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు, రెస్క్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
గత నెలలో పాకిస్థాన్‌లో మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 12 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు. ఒక ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగాయి. వాహనంలో ఇరుక్కున్న ఐదుగురు బయటకు రాలేక కాలి బూడిదయ్యారు.
ఇది కూడా చదవండి: Encounter: కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు పాక్ టెర్రరిస్ట్ లు హతం
Road Accident: మీడియా కథనాల ప్రకారం, బలూచిస్థాన్‌లోని సిబి, నోష్కీ, వాషుక్ జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. వాషుక్‌లోని నాగ్ ప్రాంతంలో దారుణమైన విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఇరాన్ పెట్రోల్ తో వెళ్తున్న జాంబియా వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనంలో ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకపోయింది. వారిలో ఐదుగురు కాలి బూడిదయ్యారు.
ఆగస్టులో కహుటా నుంచి రావల్పిండి వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. కోస్టర్ (బస్సు) బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని రెస్క్యూ 1122 పంజాబ్ అధికారి ఉస్మాన్ గుజ్జర్ తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలను కహుటాలోని తహసీల్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. అంతకుముందు, ఇరాన్ నుండి 70 మంది షియా యాత్రికులతో వెళ్తున్న బస్సు బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మక్రాన్ తీరప్రాంత రహదారి నుండి మార్గాన్ని కోల్పోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు మరణించారు.