Road Accident: యాదాద్రి- భువనగిరి జిల్లాలోని హైదరాబాద్-విజయవాడ హైవేపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఏపీ అడిషనల్ ఏఎస్పీ ప్రసాద్ ఆగస్టు 27న మృతిచెందారు. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి వెళ్తున్న స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు కారులో వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Road Accident: యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ఈ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ ఏఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇదే ప్రమాదంలో అడిషనల్ ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు తీవ్రగాయాలపాలయ్యారు. ఏపీ నుంచి ఓ కేసు నిమిత్తం విచారణ కోసం యాదాద్రికి వెళ్లిన ఇంటెలీజెన్స్ అధికారులకు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
Road Accident: మితిమీరిన వేగంతో, లేదా నిద్రలేమి కారణంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ఆనాడు భావించారు. ఈ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అడిషనల్ ఏఎస్పీ ప్రసాద్ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు.

