Road Accident

Road Accident: మట్టి లారీ కింద పడి 8 ఏళ్ల బాలుడు మృతి .. వీడియో

Road Accident: హైదరాబాద్ శివారులోని మైలార్‌దేవర్‌పల్లిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలుడిని టిప్పర్‌ (Dumper) లారీ ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తాజాగా విడుదలైన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

వెనుక టైరు కింద పడి విషాదం

శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన సయ్యద్‌ రేయానుద్దీన్‌ (8) అనే బాలుడు ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ లారీ, అకస్మాత్తుగా ఎడమవైపునకు మళ్లింది. లారీ మలుపు తిరుగుతుండగా బాలుడు దాని వెనుక టైర్‌ కింద పడిపోయాడు.

ఇది కూడా చదవండి: Digital Gold: సెబీ వార్నింగ్.. మీరు డిజిటల్ గోల్డ్ కొంటున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన బాలుడిని దవాఖానకు తరలించారు. అయితే, చికిత్స ప్రారంభించేలోపే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్‌ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *