Nitish Kumar: బిహార్ లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు.. మహిళలు కోసం ఏమి చేయలేదని ముఖ్యమంత్రి, JDU అధినేత నీతీశ్ కుమార్ విమర్శించారు.దాణా కుంభకోణంలో ఛార్జ్ షీట్ దాఖలైనప్పుడు లాలూ సీఎం పదవీకి… రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన భార్య రబ్రీ దేవీని…. సీఎం చేశారని ఆరోపించారు. ముజఫర్ పూర్ జిల్లాలోని మినాపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం నీతీశ్ … మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.
Also Read: CM Siddaramaiah: బెంగళూరు రోడ్లపై కర్ణాటక సీఎం కీలక నిర్ణయం
పెద్ద సంఖ్యలో స్వయం సహాయక బృందాల ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన….. పథకం కింద దాదాపు కోటి మంది మహిళాల ఖాతాల్లో ఒక్కొక్కరికి పదివేల రూపాయలుచొప్పున జమ చేసినట్లు చెప్పారు. కానీ, నాడు ఆర్జేడీ పాలనలో ఇందుకు విరుద్ధంగా….. మహిళలు వివక్షకు గురయ్యారని… నీతీశ్ ఆరోపించారు. అప్పటి పరిస్థితులు కారణంగానే నాడు ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నానని….. అది తప్పు అని తెలియడానికి తనకు ఎంతో సమయం పట్టలేదని నీతీశ్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మిత్రపక్షం NDAతో……. శాశ్వతంగా కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే ఐదేళ్లలో బిహార్ యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తానని నీతీశ్ హామీ ఇచ్చారు.