Tollywood

Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!

Tollywood: ఆ హీరోతో సినిమా చేయడం నా కల. ఆయన సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ అయినా, సినిమాలో చిన్న పాత్ర చేయడానికి కూడా సిద్ధం అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అసలు ఆమె ఎవరు..? ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.

ఆమె ఎవరో కాదు రితికా నాయక్. తన మొదటి సినిమా విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో మంచి పేరు వచ్చినప్పటికీ, సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ‘హాయ్ నాన్న’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది. ఢిల్లీకి చెందిన రితికా నాయక్ మోడలింగ్ రంగంతో తన కెరీర్ స్టార్ట్ చేసి చివరికి సినిమాల్లోకి వచ్చింది.

సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతగా కష్టపడిందో, అంతకంటే ఎక్కువగా సెకండ్ సినిమా కోసం కష్టపడింది. ఆమె రీసెంట్ గా తేజ సజ్జతో ‘మిరాయ్’ (Mirai) సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. వరుణ్ తేజ్‌తో ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో నటిస్తోంది. అయితే ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. అల్లు అర్జున్ తో సినిమా చేయడం తన కోరికని చెప్పింది. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను రెడీ అంది. పాత్ర నిడివి తక్కువైనా సరే చేయడానికి ఓకే అంటున్నారు రితికా నాయక్.

ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అట్లీ, లోకేష్ కనకరాజులతో సినిమాలు చేస్తున్నాడు. అలాగే బేసిల్ జోసెఫ్ ఓ సినిమా చేస్తారు అనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. వీటి తరువాత పుష్ప-3, త్రివిక్రమ్ సినిమాలు చేయనున్నారు. ఒకవేళ ఆమెకు అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ వస్తే ఏ సినిమాలో నటిస్తుందో చూడాలి. పుష్ప-3 లేదా త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్రివిక్రమ్ సినిమాలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది హీరోయిన్స్ ఉంటారు కాబట్టి, ఆ సినిమాలో ఓ క్యారెక్టర్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *